రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

VSP: నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పాయకరావుపేట నుంచి అనకాపల్లి వైపు బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.