పశువులకు గాలికుంటు టీకాలు
KNR: వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో గురువారం పశువులకు, గేదెలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. 3 నెలల వయస్సు పైబడిన పశువులన్నింటికీ ఈ టీకాలు వేసినట్లు పశువైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. ముందస్తు టీకాలు వేయించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉండి, పాడి దిగుబడి తగ్గకుండా ఉంటుందని వారు పేర్కొన్నారు.