అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

GNTR: వినుకొండలోని శివయ్య స్థూపం వద్ద తోపుడు బండిపై పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ఆ వ్యక్తి వద్ద లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతిచెందిన వ్యక్తి గుంటూరు సంగడిగుంటలోని ఐపీడీ కాలనీకి చెందిన వడ్లమూడి రాంబాబు (50)గా నిర్థారించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తిస్తే వినుకొండ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.