నీటి సమస్య పరిష్కరించాలి: సీఐటీయూ

ప్రకాశం: మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం సీఐటీయూ నాయకులు పట్టణంలో నీటి సమస్య పరిష్కరించాలని నిరసనకు దిగారు. కొద్దిరోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు.