43 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
W.G: వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 'ముఖ్యమంత్రి సహాయ నిధి' ఎంతకైనా ఉపయోగపడుతుందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.27,81,860 సీఎంఆర్ఎఫ్ చెక్కులను 43 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.