'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'
ADB: ప్రభుత్వం ద్వారా అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి సాధన తెలిపారు. రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేసినట్లు పేర్కొన్నారు. అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్, సుభాష్, తదితరులు ఉన్నారు.