'మాజీ సర్పంచ్‌లకు రావలసిన పెండింగ్ బకాయిలు చెల్లించాలి'

MHBD: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ పార్దివ దేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీలో నేడు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సర్పంచ్‌లకు రావాల్సిన బకాయి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.