VIDEO: ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేందుకై కృషి: ఎమ్మెల్యే
HNK: హన్మకొండ భవాని నగర్‌లో మహిళా సంఘం సొసైటీ సభ్యుల సమావేశంలో మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. డైరీను చట్టపరంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తేనే నిధులు, సబ్సిడీలు పొందవచ్చని చెప్పారు. దామర మండల కేంద్రంలో 10 ఎకరాల భూమి కేటాయించామని తెలిపారు.