సంజామలలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి పర్యటించారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.