ఆ గ్రామంలో దానికి నో ఎంట్రీ.. యువత కీలక నిర్ణయం!

ఆ గ్రామంలో దానికి నో ఎంట్రీ.. యువత కీలక నిర్ణయం!

ASF: బెజ్జూర్ మండలం తలాయి గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామ యువకులు మంగళవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో మద్యపాన నిషేధం అమలు కోసం యువత అంతా ఏకమై గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో మద్యం అమ్మకూడదని, మద్యం కారణంగా యువత భవిష్యత్తు నాశనమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.