ఓటమి భయంతో దాడులు: ఉషశ్రీ చరణ్

SS: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి భయంతో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైసీపీ నాయకులపై కూటమి నేతలు హత్యాయత్నాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.