ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోండి: కలెక్టర్
JGL: జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన సమస్యలపై శాఖల వారీగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.