CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NDL: సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె తన నివాసంలో పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు రూ. 11 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేదలకు సీఎం ఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు.