వివాహ వేడుకలో ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం ఓ వివాహ వేడుకలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఓ వర్గానికి చెందిన బాబు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. భోజనం వడ్డించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనాతో పాటు మరో ఇద్దరు బాబు, ఆసిఫ్‌లపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.