నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక సీతారామ సాగరం ఎంబనవలస వద్ద నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మట్టి తట్ట మోసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ... రాబోయే 100 రోజుల్లో చెరువుల పూడికతీత, కట్టల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.