ధన ధాన్య కృషి యోజన అమలుపై కలెక్టర్ సమీక్ష
సత్యసాయి: జిల్లాలో 'ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన' అమలుపై కలెక్టర్ శ్యాంప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తృణాల్ ఠాకూర్‌కు వివరించారు. పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల, కోత తర్వాతి మౌలిక సదుపాయాల బలోపేతంపై కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2025–26 నాటికి వ్యవసాయ రంగంలో 10% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ చెప్పారు.