కోతకు గురవుతున్న వంశధార నదీ తీరం

కోతకు గురవుతున్న వంశధార నదీ తీరం

SKLM: లక్ష్మీనర్సుపేట మండలంలోని బసవరాజు పేట, లక్ష్మీ నర్సుపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు వంశధార నదీ తీర గ్రామాలు కోతకు గురవుతున్నాయి. నదీలో వరద నీటి మట్టం పెరిగే సమయంలో తీర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతీ ఏడాది నదీ నీటి ప్రవాహంతో పంట పొలాలు, తీరం కోతకు గురవుతుండడంతో రక్షణ గోడలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.