ఆలయాలకూ CBN భూములు విక్రయించారు: భూమన
AP: 'శ్రీవారి ఆలయాలకు ప్రభుత్వాలు ఫ్రీగానే భూమిలిస్తాయి, కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం విక్రయించింది' అంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అమరావతి ప్రాంతంలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి వాణిజ్య ధరలకే భూములు కేటాయించారని.. ఉచితంగా ఇవ్వాలని TTD కోరినా పట్టించుకోలేదన్నారు. తిరుపతిలో శ్రీవారికి చెందిన 20 ఎకరాల భూమిని ఓబెరాయ్ హోటల్‌కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.