దీపాల కాంతులతో ఛాయా సోమేశ్వరుడి ఆలయం
NLG: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పానగల్లులోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం దీప కాంతులతో మెరిసింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు.