ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం భక్తులతో కిటకిటలాడిపోయింది.