జర్మనీలో నర్సింగ్ ఉద్యోగుల భర్తీకి ఆహ్వానం

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగుల భర్తీకి ఆహ్వానం

KMM: తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా జర్మనీలో 90 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ఏప్రిల్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు జులైలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.