నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలు

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 19,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.804 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. భారీ వరద రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.