చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PPM: రైతన్న గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బుధవారం అడ్డాపుశీల గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత ఎంత పెరిగినా రైతు లేకపోతే పట్టేడన్నం తినలేమని, రైతు లేకపోతే దేశమే లేదన్నారు.