రేపు పెద్దమ్మ గుడిలో రుద్ర హోమం, తైలాభిషేకం

BDK: పాల్వంచ పెద్దమ్మ గుడిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రుద్రహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రజనీకుమారి తెలిపారు. ఆలయ యాగశాలలో అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కలియుగంలో మానవులకు సంప్రాప్తించే కష్టనష్టాల నుంచి విముక్తి కలిగించే మహిమాన్వితమైన హోమం రుద్ర హోమం అని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు.