VIDEO: పెనుకొండలో షికారి దొంగలు అరెస్ట్
సత్యసాయి: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న షికారి దొంగలను పెనుకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ రాఘవన్ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. రొద్దం మండలం శేషాపురం గ్రామంలోని దేవాలయంలో వెండి వస్తువులు దొంగిలించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి సుమారు రూ.10 లక్షల బంగారు ఆభరణాలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు.