అంగన్వాడీకి వెళ్తుండగా కాటేసిన పాము

అంగన్వాడీకి వెళ్తుండగా కాటేసిన పాము

ELR: వేలేరుపాడు (M) రామవరంలో నిన్న విషాదం చోటుచేసుకుంది. దివాకర్, దీపిక దంపతుల కుమారుడు హన్సిక్ (5) పాము కాటుకు గురై మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండగా దారిలో పాము కరిచింది. వెంటనే జంగారెడ్డిగూడెం. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు ప్రాణాలు విడిచాడు.