నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
NTR: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది. కలెక్టర్ లక్ష్మీశా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు అర్జీలు తీసుకుంటారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చన్నారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత పత్రాలతో సమర్పించాలని సూచించారు.