నీటిని విడుదల చేసిన గ్రంథాలయ చైర్మన్
JN: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి పంటల సాగుకు గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారు.