తమలపాకుతో మిరియాలు తింటే బరువు తగ్గుతారా..?
ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి బోలెడన్ని చిట్కాలు పాటిస్తుంటారు. అయితే ఇటీవల తమలపాకుతో మిరియాలు కలిపి తింటే బరువు తగ్గుతారని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన ఆరోగ్య నిపుణులు ఇందులో నిజం లేదని కొట్టిపారేశారు. తమలపాకులు ఆహారం తేలికగా జీర్ణమవ్వడానికి దోహదపడతాయని.. మిరియాల్లోని పైపెరిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.