నడింపల్లిలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం
SS: సోమందేపల్లి మండలం కేతగానిచెరువు, నడింపల్లి గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి విజయభారతి రైతులు పండించిన కంది పంటను పరిశీలించారు. రబీలో సాగు చేసిన పంటల వివరాల అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన కంది పంట ప్రస్తుతం కాయ దశలో ఉందన్నారు. పలు సూచనలు రైతులకు అందించారు.