'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

SRD: మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని సర్వోదయ మంజీర ఉమెన్ ఎంటర్ ప్రైజెస్ కమిషనర్ డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మల్కాపూర్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ పాల్గొన్నారు.