అల్లూరి బస్సు ఘటన బాధాకరం: కిషన్‌రెడ్డి

అల్లూరి బస్సు ఘటన బాధాకరం: కిషన్‌రెడ్డి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా బస్సు లోయలో పడి పలువురు యాత్రికులు మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.