'కిష్కింధపురి' డబ్బింగ్ పనులు స్టార్ట్

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 'కిష్కింధపురి'. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా దీని డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్.. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఇక కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.