అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు

అంగన్వాడీ టీచర్లకు పదోన్నతులు

W.G: ఉండి నియోజకవర్గంలో ఉన్న 13 మినీ అంగన్వాడి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం జరిగింది. అలాగే ఈ మినీ అంగన్వాడీ కేంద్రాలలో పని చేస్తున్న కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. పదోన్నతి పొందిన ఈ 13 మందికి ఎమ్మెల్యే కార్యాలయంలో రఘురామకృష్ణ రాజు ఇవాళ ఉత్తర్వులను అందజేశారు.