కిరాణ షాపులో అగ్నిప్రమాదం.. రూ.4 లక్షల నష్టం
VKB: బొంరాస్‌పేట(M) తుంకిమెట్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక కిరాణ షాపు యజమాని జోగు అంజిలయ్యకు చెందిన దుకాణంలో నిన్న రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపులోని సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ. 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.