ఈ నెల 28న లోక్ అదాలత్
SRD: రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో, రాజీ మార్గాన కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందాలని న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరారు.