మొదటి స్థానంలో గౌరవెల్లి గ్రామ పంచాయతీ
SDPT: అక్కన్నపేట మండలంలోనే అత్యధిక జనాభాతో గౌరవెల్లి గ్రామం మొదటి స్థానంలో ఉంది. అలాగే 2823 ఓటర్లతో మండలంలోనే అతిపెద్ద గ్రామపంచాయతీగా కూడా నిలిచింది. ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి 9 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. 10 వార్డులు కలిగిన ఈ గ్రామంలో 32 మంది వార్డు స్థానాలకు పోటీలో ఉన్నారు.