శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

KDP: జిల్లా కేంద్రమైన కడపతోపాటు బద్వేలు,మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల డిపోల నుంచి జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు 100 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పొలిమేర గోపాల్ రెడ్డి తెలిపారు. ఈనెల 27, నవంబర్ 3,10,17 తేదీల్లో కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు.