బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా పరిషత్ సీఈవో
నిర్మల్ పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని సోమవారం జిల్లా పరిషత్ సీఈవో శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, వసతులు, గదుల పరిశుభ్రతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ, విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.