నెల్లూరులో సచివాలయ ఉద్యోగులకు నోటీసులు
NLR: కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురు సచివాలయ కార్యదర్శులకు కమిషనర్ నందన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సచివాలయాల్లో సిబ్బంది లేకుండా లైట్లు, ఫ్యాన్లు వేసి ఉన్నారని స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ సచివాలయ కార్యదర్శులకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.