'హస్తకళలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది'
SKLM: హస్తకళలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. బుధవారం సారవకోట మండలం బుడితి గ్రామంలోని కళాకారులు తయారుచేస్తున్న ఇత్తడి పాత్రలు, ఇతర హస్తకళ ఉత్పత్తుల అభివృద్ధి కొరకు, హస్తకళల విభాగంలో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ పాల్గొన్నారు.