ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఇవాళ కట్టంగూర్ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:00 నుంచి అయిటిపాముల, చెర్వుఅన్నారం, గార్లబావిగూడెం, కురుమర్తి, కట్టంగూర్, ముత్యాలమ్మ గూడెం, ఎర్రసానిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.