VIDEO: మల్లన్న స్వామి వేడుకల్లో మాజీ మంత్రి
SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌లోని మల్లన్న స్వామి ఆలయ వార్షికోత్సవం జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్థానిక యాదవ సంఘం నాయకులు వారిని ఘనంగా స్వాగతించారు. స్థానిక ఆలయంలో ఇవాళ గణపతి పూజ, పుణ్యహావచనం, మల్లన్న స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరిగాయి. హరీష్ రావు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.