రిమాండ్ ఖైదీ మృతి.. సీఐ సస్పెన్షన్
SRPT: సంచలనం సృష్టించిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ మృతి కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా, చిలుకూరు ఎస్సై సురేష్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజేష్ మృతిపై విమర్శలతో ఈ కేసులో మరికొంతమంది పోలీస్ సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశం ఉంది.