భక్తులతో కిటకిటలాడిన అడెల్లి మహా పోచమ్మ ఆలయం
NRML: సారంగాపూర్ మండలంలోని ప్రస్తుత పుణ్యక్షేత్రమైన అడెల్లి మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎండోమెంట్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.