అర్హులైన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలి: వర్మ

KKD: పిఠాపురం నియోజవర్గంలో అర్హులైన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని పిఠాపురం మాజీ MLA వర్మ కోరారు. పిఠాపురం మండలానికి చెందిన ప్రజలు ఉపాధి పనులు సక్రమంగా కల్పించడం లేదని తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి పనులు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. పనులు కల్పించకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.