పరిశ్రమలకు సకాలంలో అనుమతులివ్వాలి: కలెక్టర్
SRPT: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలకు 82 యూనిట్లు మంజూరు చేశామన్నారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, నిబంధనల మేరకు అనుమతులివ్వాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.