కుక్కుటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్
KKD: రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ చావలి సునీల్ శనివారం పిఠాపురంలో పర్యటించారు. ఇక్కడ ఆయన కుక్కుటేశ్వరుడు, పురుహుతికా అమ్మవారు, దత్తాత్రేయుడిని దర్శించుకున్నారు. కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదాలు ఆయనకు అందజేశారు.