తండ్రి అడుగుజాడల్లో కూతురు

తండ్రి అడుగుజాడల్లో కూతురు

SDPT: గజ్వేల్‌కు చెందిన 22 ఏళ్ల మనస్వి, తండ్రి రాజు (టీచర్) అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక స్పృహను చాటుకుంది. గత 25 ఏళ్లుగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న తండ్రిని చూసి తానూ వారికి అండగా ఉండాలని నిశ్చయించుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం పొంది, తన మొదటి జీతాన్ని ఐదు రైతు కుటుంబాలకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసి ఉదారతను చాటుకుంది. దీంతో ఆమెను పలువురు అభినందిస్తున్నారు.