తూప్రాన్ పట్టణంలో నార్కోటిక్ డాగ్ తనిఖీలు
MDK: తూప్రాన్ పట్టణంలో సోమవారం నార్కోటిక్ డాగ్ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై శివానందం తెలిపారు. జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తూప్రాన్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, దాబా హోటల్స్‌ల్లో తనిఖీలు నిర్వహించినట్లు వివరించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.